ఏపీ సబ్‌రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడిగా గోపాల్‌

ఈనాడు, విశాఖపట్నం: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో మూడేళ్లకు ఒకసారి నిర్వహించే సబ్‌రిజిస్ట్రార్‌, ఉద్యోగుల సంఘ ఎన్నికలు ఈ సారి విశాఖలో జరిగాయి. ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఏపీ సబ్‌రిజిస్ట్రార్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎ.గోపాల్‌ (సబ్‌రిజిస్ట్రార్‌ నల్లపాడు, గుంటూరు), ప్రధాన కార్యదర్శిగా ఎం.కృష్ణప్రసాద్‌ (గుణదల), కోశాధికారిగా ఎన్‌.ఆనందకుమార్‌ (ఆనందపురం, విశాఖ), ఉపాధ్యక్షుడిగా ఎండీ అజీజుల్లా (కడప), సంయుక్త కార్యదర్శిగా డీవీ నారాయణ (విశాఖ), స్పోర్ట్స్‌ సెక్రటరీగా నిరంజన్‌కుమార్‌(విశాఖ) ఎన్నికయ్యారు. వీరిలో ఆనందకుమార్‌ కోశాధికారిగా ఏకగ్రీవమవగా...మిగిలినవారికి ఎన్నిక జరిగింది. అలాగే ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా సత్తార్‌, కార్యదర్శిగా కిరణ్‌, కోశాధికారిగా రాంబాబు ఎన్నికయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts