పోలీసు శిక్షణ విభాగ ఐజీ వెంకట్రామిరెడ్డికి రాష్ట్రపతి పతకం

ముగ్గురికి శౌర్య, ఇద్దరికి పోలీసు సేవా పతకాలు

ఈనాడు, అమరావతి; న్యూస్‌టుడే, పలాస, బిట్రగుంట: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శిక్షణ విభాగం ఐజీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.వెంకట్రామిరెడ్డికి రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. గ్రేహౌండ్స్‌ విభాగం అసిస్టెంట్‌ అసాల్ట్‌ కమాండర్‌ మండ్ల హరికుమార్‌, జూనియర్‌ కమాండోలు ముర్రే సూర్యతేజ, పువ్వల సతీష్‌లకు శౌర్య పతకాలు వరించాయి. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ జె.శాంతారావు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్సై నారాయణమూర్తికి పోలీసు సేవా పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలో మొత్తం ఆరుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ పతకాలు ప్రకటించింది.

* ముంబయి పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లఖినాన కేశవరావు 2020 ఏడాదికిగాను రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. కేశవరావు 1982లో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరారు. 1997 గణతంత్ర దినోత్సవంలో పోలీసు మెడల్‌ కూడా అందుకున్నారు.

* నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎన్‌.సుబ్బారావు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. సోమవారం దిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఈ పురస్కారం అందుకోనున్నారు. సుబ్బారావు సికింద్రాబాద్‌ జోనల్‌ పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇన్‌స్రక్టర్‌గా (ఏఎస్‌ఐ) పనిచేస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts