‘ఆహా...’ర కేతనం..!

20 టన్నుల తాజా కూరగాయాలు పేర్చి.. 7,625 చ.అడుగుల విస్తీర్ణంలో సృష్టించిన జాతీయ జెండా ఆకారం బెంగళూరులో ఆకట్టుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వేకూల్‌ సంస్థ ఈ ప్రయత్నం చేసింది. బెంగళూరులోని కన్నమంగలలో సంస్థ వితరణ కేంద్రంలో క్యారెట్, ముల్లంగి, బెండ, బీన్స్‌, క్యాప్సికం, బంగాళదుంపలతో దీన్ని రూపొందించారు. ప్రదర్శన అనంతరం ఈ కూరగాయలను అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అందజేశారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు (సదాశివనగర)


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని