పదోన్నతుల పోస్టింగుల్లో అక్రమాలకు తావులేదు

ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వెల్లడి

ఈనాడు, అమరావతి: పదోన్నతులు పొందిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారు(ఎంపీడీవో)ల పోస్టింగుల్లో అక్రమాలకు తావులేదని రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.బ్రహ్మయ్య, జీవీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పదోన్నతులు, పోస్టింగ్‌లు పారదర్శకంగా జరిగాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అవకతవకలు జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండిస్తున్నామని చెప్పారు. గ్రూపు-1 ద్వారా నియమితులై ఎంపీడీవోలుగా దాదాపు 25 ఏళ్లపాటు అదే పోస్టులో కొనసాగుతూ.. ఒక్క పదోన్నతికి కూడా నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం రెండు రోజుల క్రితం పదోన్నతులు కల్పించిందని వారు వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts