హైకోర్టు సీజేకు సీఎం జగన్‌ పరామర్శ

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు పరామర్శించారు. ఈనెల 2న సీజే మాతృమూర్తి నళిని మిశ్ర(85) ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. సంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీజే కుటుంబం విజయవాడ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts