శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం, న్యూస్‌టుడే: శ్రీశైల మల్లికార్జునస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో పాటు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు స్పర్శ దర్శనం, గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆదివారం 6 గంటలకుపైగా సమయం పట్టింది. నిత్యాన్నదాన ప్రసాదాన్ని ఉదయం నుంచి అందుబాటులో ఉంచారు.


మరిన్ని

ap-districts
ts-districts