పాత పింఛన్‌ విధానం కోరుతూ చలో విజయవాడ: ఏపీసీపీఎస్‌ఈఏ

ఈనాడు, అమరావతి: పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను సాధించుకునేందుకు సెప్టెంబరు ఒకటిన చలో విజయవాడ (మరో మిలియన్‌ మార్చ్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్‌ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ‘కరవు భత్యం బకాయిలను ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులకు మాత్రం బకాయిలను జమ చేయలేదు. మనకు కూడా పీఎఫ్‌ ఖాతా ఉంటే సమస్య ఉండేది కాదు. దీన్నిబట్టి సీపీఎస్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతుందో అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని