సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం

ఆర్టీసీ ఎన్‌ఎంయూఏ తీర్మానం

ఈనాడు, అమరావతి: ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పరంగా, యాజమాన్యపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే ఐకాస ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధం కావాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) తీర్మానం చేసింది. ఆ సంఘం సెంట్రల్‌ కమిటీ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. పీటీడీ ఉద్యోగులకు తక్షణం పీఆర్సీ అమలు చేయాలని, ఎస్‌ఆర్‌బీఎస్‌ కొనసాగించాలని, వివిధ భత్యాలు పునరుద్ధరించాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం 1/2019 సర్క్యులర్‌కు భిన్నంగా ఇస్తున్న పనిష్మెంట్ల విధానాన్ని మార్చాలని, పదోన్నతులు కల్పించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, అన్ని జిల్లాలు, జోన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts