ఎస్సీ గురుకులాల్లో సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రవేశాలు

మంత్రి మేరుగు నాగార్జున

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకూ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఇంటర్‌లో ఎంఈసీ, సీఈసీ కోర్సులను ఎంపీసీ, బైపీసీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గురుకులాల్లో ప్రవేశాల తీరుపై మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్షించి, మాట్లాడారు.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పించరాదనే నిబంధనను సడలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క సీటూ ఖాళీగా ఉండకూడదని, పాఠశాల స్థాయిలో భర్తీ అయితే జిల్లా స్థాయిని ప్రాతిపదికగా తీసుకుని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనంగా సీట్లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యాప్రమాణాలు మెరుగుకు వారాంతపు పరీక్షలు పెట్టాలని, ట్యూటర్లను నియమించాలని ఆదేశించారు.


మరిన్ని

ap-districts
ts-districts