శ్రీశైలంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై నిషేధం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా శ్రీశైలం ఆలయ మహాక్షేత్రంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని నిషేధించినట్లు దేవస్థానం ఈవోఎస్‌ లవన్న మంగళవారం తెలిపారు. స్థానికులు, వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్‌ కవర్లకు బదులు కాగితం, వస్త్రం, జనపనారతో చేసిన సంచులను ఉపయోగించాలని ఆదేశించారు. ఈనెల 26 నుంచి క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్‌పై నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని, ఆలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిషేధం అమల్లోకి వచ్చాక ప్లాస్టిక్‌ వినియోగిస్తే జరిమానా విధిస్తామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts