కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

ఈనాడు, అమరావతి: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 20 వరకు జరగనున్నాయి. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు, దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వాన పత్రికనూ ముఖ్యమంత్రికి అందజేశారు. ఆలయ వేదపండితులు స్వామివారి ప్రసాదాలు, అందజేసి, ఆశీర్వచనం పలికారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని