సీఎం సహాయనిధికి ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ రూ.1.05 కోట్ల విరాళం

ఈనాడు, అమరావతి: చెన్నైకి చెందిన ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (జెమ్‌ గ్రానైట్స్‌ గ్రూప్‌ కంపెనీ) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1.05 కోట్ల విరాళం అందజేసింది. జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల ఛైర్మన్‌ ఆర్‌.వీరమణి, జెమ్‌ గ్రానైట్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.గుణశేఖరన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి చెక్కు అందజేశారు. కొవిడ్‌-19 నివారణకు సీఎం తీసుకున్న చర్యలు తమను ఎంతో ప్రభావితం చేశాయని వారు చెప్పినట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిసింది. కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts