ఆరోగ్య రికార్డుల అనుసంధానంలో రాష్ట్రం ముందంజ

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడంలో ఏపీ ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 69,683 హెల్త్‌ రికార్డులను డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్స్‌తో అనుసంధానం చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి 13,346 ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో చేరినట్లు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌ (26,824) తర్వాత ఈ పథకంతో అనుసంధానమైన అత్యధిక ఆసుపత్రులు ఏపీలోనే ఉన్నట్లు వెల్లడించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని