కారు దిగి.. వినతిపత్రాలు తీసుకున్న సీఎం

విశాఖపట్నం (మాధవధార), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి.. వారంతా వివిధ సమస్యలను ఆయన దృష్టికి తేవాలనుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఇంటికి వచ్చి తిరిగి విమానాశ్రయానికి వెళ్తుండగా పలువురు మహిళలు.. వినతులు తీసుకోవాలని కోరారు. దాంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన వాహనం ఆపించి, కిందకు దిగి.. వారి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం విశాఖ మర్రిపాలెం రాణాప్రతాప్‌నగర్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి, ఇటీవల పెళ్లయిన వాసుపల్లి కుమారుడిని, కోడలిని ఆశ్వీరదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 9న జరిగిన వీరి పెళ్లికి ముఖ్యమంత్రి హాజరు కాలేకపోయారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డి, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజిని, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts