చిమ్మచీకట్లలో.. వరదనీటిలో..

న్యూస్‌టుడే, ఎటపాక: ఓవైపు గోదావరి వరద, మరోవైపు విద్యుత్తు సరఫరా నిలిపివేతతో అంధకారంలో మగ్గుతున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు గ్రామస్థులు మంగళవారం ప్రధాన రహదారిపై కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిందని, బయటికి వెళ్లేందుకు దారులు మూసుకుపోయాయని వాపోయారు. వరదలో విషసర్పాలు కొట్టుకు వస్తున్నాయని, విద్యుత్తు సరఫరా లేనందున చీకట్లో భయంభయంగా బతుకుతున్నామని ఆవేదన చెందారు.      


మరిన్ని

ap-districts
ts-districts