అభిమానికి చిరంజీవి బాసట

హైదరాబాద్‌ రప్పించి క్యాన్సర్‌కు చికిత్స

ఈనాడు, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిని హైదరాబాద్‌కు పిలిపించి, మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌ చిరంజీవి అభిమాని. ఎన్నో ఏళ్లుగా సేవా  కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ స్థానికంగా చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. సొంతూరి నుంచి నగరానికి రప్పించి, ఒమేగా ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts