ఈ-ఇన్వాయిస్‌ ‘వార్షిక టర్నోవర్‌’ తగ్గింపు

ఈనాడు, అమరావతి: వార్షిక టర్నోవర్‌ రూ.10 కోట్లు దాటిన వారు ఈ-ఇన్వాయిస్‌ను విధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్‌ రూ.20 కోట్లు దాటిన వ్యాపారస్తులు ఈ-ఇన్వాయిస్‌ను జారీ చేస్తున్నారు. ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీల సమయంలో అమ్మకందారు పన్ను చెల్లించేందుకు, కొనుగోలుదారు ఇన్‌ఫుట్‌ సౌకర్యం పొందేందుకు ఈ తాజా నిర్ణయం ఉపయోగపడుతుంది. ఈ కొత్త విధానం అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts