90 రోజులవుతున్నా.. ఛార్జిషీటు వేయలేదేం?

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ వచ్చేలా ప్రభుత్వం, పోలీసుల సహకారం: ముప్పాళ్ల

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా సక్రమంగా లేదని చెప్పడానికి కాకినాడ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు ప్రత్యక్ష సాక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ వచ్చేలా ప్రభుత్వం, పోలీసులు అన్నిరకాల ప్రయత్నాలూ చేయడం దురదృష్టకరమన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ అనంతబాబు మూడో బెయిల్‌ పిటిషన్‌పై వాదనలకు గడువు కావాలని అతడి తరఫు న్యాయవాది కోర్టును కోరడంతో ఇప్పటికే రెండుసార్లు విచారణ వాయిదా పడిందన్నారు. మరోవైపు నిందితుడిని రిమాండుకు పంపించి ఈ నెల 20 నాటికి 90 రోజులు పూర్తికావస్తుందన్నారు. ఈలోగా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి చట్టప్రకారం బెయిలు పొందే హక్కు లభిస్తుందన్నారు. ఈ కేసులో మొదట్నుంచి పోలీసులు నిందితుడికి సహకారం అందిస్తూ సక్రమంగా విచారణ జరపలేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తగిన ఆధారాలతో మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని