అవినీతి వ్యక్తులు సీఎంలు కావడానికి సహకరించిందెవరు?: లక్ష్మీనారాయణ

ఈనాడు, అమరావతి: అవినీతి, ఆశ్రితపక్షపాతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అంటూ నీతులు చెప్పే ప్రధాని మోదీ దేశ సంపదను కార్పొరేట్లకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారని సామాజిక ఉద్యమకారుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘‘అవినీతి, క్విడ్‌ ప్రోకో కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులు సీఎంలు కావడానికి తోడ్పాటును అందించింది ఎవరు? అధికారంలోకి వచ్చాక సంపూర్ణ సహకారం అందిస్తున్నది ఎవరు? ఎవరిని మోదీ దత్తపుత్రుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి అభివర్ణించారు? నీతులు చెప్పడంలో, నినాదాలు ఇవ్వడంలో ప్రధాని మోదీ దిట్ట. ఆచరణలో మాత్రం దోపిడీ, అవినీతికి పాల్పడే వాళ్లకు పూర్తి మద్దతు ఇస్తున్నారు’’ అని మండిపడ్డారు.


మరిన్ని

ap-districts
ts-districts