ఆధునిక భారత నిర్మాతల్లో ప్రముఖుడు వాజ్‌పేయీ

నివాళులర్పించిన చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయుల్లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ముఖ్యులని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. మంగళవారం వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు. ‘‘వాజ్‌పేయీ హయాంలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులు, ఓపెన్‌స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలసి పనిచేయడం, భాగస్వామి కావడం నాకు ఎంతో సంతృప్తినిచ్చే అంశం. దేశంలో అభివృద్ధి చెందిన రహదారుల్లో సగం వాజ్‌పేయీ హయాంలో వేసినవే. ఆయన ప్రధానిగా ఉండగా జరిగిన పోఖ్రాన్‌ అణు పరీక్షలు, కార్గిల్‌ విజయం వంటివి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి’’ అని చంద్రబాబు కొనియాడారు.


మరిన్ని

ap-districts
ts-districts