మధ్యాహ్న భోజనం తయారీకిచ్చే మొత్తం పెంపు..

రెండేళ్ల తర్వాత 9.60 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం!

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విద్యార్థులకు ‘మధ్యాహ్న భోజనం’ తయారీలో వంట ఏజెన్సీలకు అందజేసే మొత్తం పెరగనుంది. కొన్నేళ్లుగా ఏటా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వంతున పెంచుతోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ మాటెత్తలేదు. మరోవంక.. ధరల మంట నేపథ్యంలో వివిధ తరగతుల విద్యార్థులకు భోజనం తయారీకి ప్రభుత్వాలు చెల్లించే ధరను పెంచాలని వంట ఏజెన్సీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ కొద్ది నెలల క్రితం నివేదికను సమర్పించింది. ఎన్‌ఐఎన్‌ మాత్రం 1-5 తరగతుల విద్యార్థులకు రూ.10లు, ఇతరులకు రూ.12లకు పెంచాలని సిఫారసు చేసినట్లు సమాచారం. మొత్తానికి 20 శాతం వరకు పెంచవచ్చని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు చెల్లిస్తున్న ధరలపై 9.6 శాతం పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మొత్తంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా భరిస్తాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు