దసపల్లా భూములకు రాజకీయ రంగు తగదు

ఇష్టపూర్వకంగానే అష్యూర్‌ సంస్థతో ఒప్పందం

ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, దిగ్విజయ్‌ చంద్రదేవ్‌ భంజ్‌ వెల్లడి

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: దసపల్లా భూములకు రాజకీయ రంగు వేయవద్దని ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్‌ చంద్రదేవ్‌ భంజ్‌ ఓ ప్రకటనలో కోరారు. ఇష్టపూర్వకంగానే తమ కుటుంబసభ్యులు, ఇతర కొనుగోలుదారులు ఆయా భూములను అభివృద్ధి చేసుకోవడానికి అష్యూర్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థతో సంయుక్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి, బలవంతం లేదని, ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో తమకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ భూములకు సంబంధించి రాజకీయ నాయకులెవర్నీ సంప్రదించలేదన్నారు. న్యాయస్థానాలు తమ భూములను ప్రైవేటువిగా ప్రకటించాయని చెప్పారు. ఈ సందర్భంగా దసపల్లా భూములకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. దసపల్లా కుటుంబ సభ్యులు, కొనుగోలుదారులు నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను డీనోటిఫై చేయాలని ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారని వెల్లడించారు. 


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు