
దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్
పట్టువస్త్రాల సమర్పణ
ఈనాడు, అమరావతి: శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆదివారం మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3గంటలకు దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో మేళతాళాలతో తోడ్కొనివెళ్లారు. అమ్మవారి దర్శనానంతరం ముఖ్యమంత్రికి అర్చకులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం 3.50గంటలకు ముఖ్యమంత్రి తిరిగి వెళ్లిపోయారు. మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు ముఖ్యమంత్రి వెంట వచ్చారు.
మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు తెల్లవారుజామున నుంచే భారీగా వచ్చారు. ఇంద్రకీలాద్రి కొండ, క్యూలైన్లు నిండి భక్తులు రోడ్లపై ఇబ్బందులుపడ్డారు. తోపులాట జరగడంతో పలువురు గాయపడ్డారు. చిన్నారులతో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచివున్నారు.
-ఈనాడు, అమరావతి
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ