మా రోడ్డు ఎప్పుడు వేస్తారు?

ఎమ్మెల్యే సుచరితను నిలదీసిన వైకాపా నాయకుడు

ప్రత్తిపాడు (నడింపాలెం), న్యూస్‌టుడే: ‘మీరు వచ్చి మూడేళ్లయింది.. మాకు రోడ్డు ఎప్పుడు వేస్తారో చెప్పాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితను వైకాపా నాయకుడు సాంబయ్య నిలదీశారు. ప్రజలు తమను విమర్శిస్తుంటే చెవులు మూసుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేశామని ఎమ్మెల్యే చెప్పినా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఆయన్ను వారించి ఇంటికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కొత్తగా నిర్మించిన రెండు గ్రామ సచివాలయ భవనాలను, రిక్షాలను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. రెండు భవనాల శిలాఫలకాలపై ఉప ఎంపీపీ ఆఫ్రిన్‌ సుల్తానా పేరు లేకపోవడం, సర్పంచి లాం రత్నకుమార్‌ పేరును చివర్లో రాయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె డీఈ రమేశ్‌బాబును పిలిచి ప్రశ్నించారు. ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ప్రొటోకాల్‌ ప్రకారమే పేర్లు ఉండాలని, ఈ విషయం తర్వాత మాట్లాడదామన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు