వైకాపా కార్యాలయానికి భూ కేటాయింపుపై నిరసన

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు శివారులో చింతలవీధి వద్ద రెండెకరాల భూమిని వైకాపా కార్యాలయం ఏర్పాటుకు కేటాయించడంపై స్థానికులు ఆదివారం పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామస్థులు పాడేరు-హుకుంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. వాహనాల రాకపోకలు సుమారు గంటకు పైగా నిలిచిపోయాయి. ఎస్సై లక్ష్మణ్‌ అక్కడకు చేరుకుని అందోళనకారులకు నచ్చజెప్పి పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ నిరుపేదలకు చెందాల్సిన బంజరు భూములను వైకాపా కార్యాలయానికి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. తమ పూర్వీకుల నుంచి ఈ భూమిని పశువుల పెంపకం, ఇతర అవసరాలకు వాడుకుంటున్నామన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు