
రాజధానిలో రహదారుల విధ్వంసం
సచివాలయం సమీపంలో రోడ్డు తవ్వి మట్టి, కంకర
తవ్వుకుపోయిన దుండగులు
తుళ్లూరు గ్రామీణం, మంగళగిరి(తాడేపల్లి), న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం కొనసాగుతోంది. అక్రమార్కులు రోడ్లను తవ్వి మట్టి, గ్రావెల్, కంకర, ఇసుకను తరలించుకుపోతున్నారు. తాజాగా మందడం, కురగల్లు మధ్యలో గత ప్రభుత్వంలో నిర్మించిన రహదారిని దుండగులు ధ్వంసం చేశారు. మట్టి తవ్వకాలు, రహదారుల విధ్వంసం జరిగిన ప్రాంతం రాష్ట్ర సచివాలయానికి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న రహదారులను దుండగులు తవ్వుకుపోతే.. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తారు రోడ్లనూ ధ్వంసం చేయడం ప్రారంభించారు. యర్రబాలెం వైపు నుంచి వీఐటీ(ఏపీ) యూనివర్సిటీ వైపు సుమారు 60 అడుగుల విస్తీర్ణంలో గత ప్రభుత్వంలో డివైడరుతో కూడిన తారు రోడ్డు నిర్మించారు. ఆ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో రహదారిపై తారును యంత్రాలతో తవ్వి పక్కనపోసి దాని కింద ఉన్న కంకర, డస్ట్, గ్రావెల్‌ను తరలించారు. అడుగున్నర లోతు వరకు ఉన్న కంకర డస్ట్‌ను తవ్వారు. ఒకేచోట 150 మీటర్లకు పైగా రోడ్డును తవ్వేశారు. సమీపంలో మరికొన్ని చోట్ల కొన్ని మీటర్ల మేర తవ్వారు. మందడం, కురగల్లు, యర్రబాలెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వి తరలించుకుపోయారు. ఆ ప్రాంతంలో వాహనాలు తిరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు ఈ ప్రాంతంలో దొంగలు జేసీబీలు, టిప్పర్లతో చొరబడి రహదారులను తవ్వుతున్నారని స్థానికులు తెలిపారు. ఉద్దండరాయునిపాలెం, మోదుగలింగాయపాలెం, రాయపూడి, ఐనవోలు, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల పరిసర ప్రాంతాల్లో అక్రమార్కులు రహదారులను తవ్వి మట్టి, కంకర తరలించిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉంటున్న ఒక ప్రజాప్రతినిధికి తెలియకుండా మట్టి, కంకర దొంగతనాలు జరగవని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజధానిలో ఇంతలా రహదారుల విధ్వంసం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ