అప్పుగా తెచ్చిన రూ.70 వేలు... ఎలుకల పాలు

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు పంచాయతీలోని బృందావనం గ్రామానికి చెందిన చిరుగూరి అగస్టీన్‌ రోజు వారీ కూలీ. తిండి గింజల కోసం కొంత భూమిలో వరి సాగు చేస్తున్నారు. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం రెండు రోజుల క్రితం రూ.70 వేలు అప్పు చేసి తీసుకొచ్చి ఇంట్లో గోడకు అమర్చిన చిన్న చెక్క పెట్టెలో పెట్టారు. ఆదివారం తాళం తీసి చూసేసరికి నోట్లన్నీ ముక్కలు ముక్కలుగా చిరిగి ఉన్నాయి. చెక్క పెట్టె వెనుక గోడకు రంధ్రం ఏర్పడటంతో ఎలుకలు వచ్చి నగదును కొరికేశాయని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు