దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సోమవారం దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆది, సోమ రెండు రోజుల్లోనే నాలుగున్నర లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సాయంత్రం 5గంటలకు వేదసభ నిర్వహించి, వేదపండితులను సత్కరించారు. మంగళవారం అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకలు బుధవారం ముగియనున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు