నేడు తిరుపతికి మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, నేరుగా తిరుమల వెళ్లి బస చేయనున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని, మధ్యాహ్నం 12 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు