జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి పరీక్షల తేదీలు

ఈనాడు, అమరావతి: జిల్లాకోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీల్ని వెల్లడిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఎస్‌.కమలాకరరెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3/జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్టు/ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబరు 21న మూడు విడతలు, 22న మూడు, 23న ఒక విడత, 29న రెండు విడతలు, జనవరి 2న మూడు విడతల్లో పరీక్ష ఉంటుంది. కాపీయిస్టు/ఎగ్జామినర్‌/రికార్డు అసిస్టెంట్‌ పోస్టులకు డిసెంబరు 26న రెండు విడతల్లో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. డ్రైవర్‌/ప్రాసెస్‌ సర్వర్‌/ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులకు డిసెంబరు 26న ఒక విడత, 27న మూడు, 28న మూడు విడతలు, 29న ఒకవిడతలో ఉమ్మడి పరీక్ష ఉంటుంది. డిసెంబరు 16 నుంచి హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు