పరిహారం చెల్లింపులో అక్రమాలు

హైకోర్టులో భూములిచ్చిన రైతుల వ్యాజ్యం
మంత్రి విడదల రజిని సహా పలువురికి నోటీసులు 

ఈనాడు, అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో స్థలాలిచ్చేందుకు తమనుంచి సేకరించిన భూమికి పరిహారాన్ని సక్రమంగా చెల్లించలేదంటూ రైతులు దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఆమె అనుచరులు మల్లెల రాజేష్‌నాయుడు, గడిపూడి గోపి, జంపని నాగమల్లేశ్వరరావు, దశరథరామయ్య, ప్రత్తిపాటి శేషయ్యతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పరిహారం కోసం ఈ ఏడాది మార్చి 28న పిటిషనర్లు ఇచ్చిన వినతిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని రెవెన్యూశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు