హెచ్‌ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్‌

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా అమృతలూరు మండలం బోడపాడు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.శ్రీనివాసరావుపై ఈ నెల 4న దాడి చేసిన కనగాల వంశీ అతనికి మద్దతుగా నిలుస్తున్న అధికార పార్టీకి చెందిన గేరా ప్రతాప్‌పై పోలీసులు సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.చిరంజీవి డిమాండ్‌ చేశారు. పట్టణంలో బుధవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. వంశీ తన భార్యకు పాఠశాలలో ఆయా పోస్టు ఇప్పించాలని హెచ్‌ఎం.ను కోరాడన్నారు. ఆ అంశం తన పరిధిలో లేదని, తల్లిదండ్రుల కమిటీ, అధికారులను సంప్రదించాలని శ్రీనివాసరావు సూచించారన్నారు. దాంతో మాజీ సర్పంచి గేరా ప్రతాప్‌ ప్రోద్బలంతో హెచ్‌ఎంపై వంశీ దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ విషయమై అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను కలిసి ఫిర్యాదు చేయగా.. నిందితులపై సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించి పది రోజులైనా స్థానిక పోలీసుల్లో కదలిక లేదన్నారు.


మరిన్ని