చిరంజీవికి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభినందనలు

ఈనాడు, దిల్లీ: గోవాలో తాజాగా జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022’ పురస్కారాన్ని ప్రకటించడంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. సినీరంగంలో చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని ఆయన అభినందించారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు.


మరిన్ని