అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా

ఈనాడు, అమరావతి: అంగన్‌వాడీ వర్కర్లను గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లుగా భర్తీ చేసే ప్రక్రియను కొనసాగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ బుధవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్‌వాడీ వర్కర్లను... గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లుగా నియమించేందుకు 560 పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2022 సెప్టెంబరు 5న నోటిఫికేషన్‌ జారీచేసింది. రాతపరీక్షకు 45 మార్కులు, ఆంగ్లంలో ప్రావీణ్యానికి 5 మార్కులు నిర్ణయించింది. రాతపరీక్షను నిర్వహించింది. అయితే... రెండు పరీక్షలను ఒకేసారి నిర్వహించలేదని, రాతపరీక్షలో ప్రతిభావంతుల జాబితాను కూడా బహిర్గతం చేయకుండానే ఫలితాల విడుదలకు సిద్ధమవుతున్నారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. బుధవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున న్యాయవాది శశిభూషణ్‌రావు వాదనలు వినిపిస్తూ.. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికే ఆంగ్లంలో ప్రావీణ్య పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నామన్నారు. పిటిషనర్లు అర్హత సాధించలేదన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు