
పట్టభద్ర ఓటర్లు 8.99 లక్షలు.. ఉపాధ్యాయ ఓటర్లు 43,170
ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగబోయే శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 8,99,280 మంది, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో 43,170 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల నియోజకవర్గాలకు 975, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 348 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా వివరాలు తెలిపారు. ముసాయిదా జాబితాపై డిసెంబరు 9వ తేదీ వరకూ అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారు. అర్హులై ఉండి ఓటర్ల జాబితాలో పేరు లేనివారు కూడా ఈ గడువు తేదీలోగా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 30న తుది జాబితా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీలు వై.శ్రీనివాసులరెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహారెడ్డి, పీవీఎన్ మాధవ్‌ల పదవీకాలం 2023 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్‌రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ఇయాన్ హీలీ ‘పిచ్’ వ్యాఖ్యలకు జాన్ రైట్ కౌంటర్..
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు