
ఒక రోజులో10కి మించి దరఖాస్తులు ఇవ్వొద్దు
పోలింగ్ బూత్ ఏజెంట్లకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు రోజుకు పదికి మంచి దరఖాస్తులను నేరుగా సమర్పించవద్దని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆయా దరఖాస్తుల వివరాలతో పాటు లిఖిత పూర్వక ప్రకటన (రిటన్ డిక్లరేషన్) ఇవ్వాలని నిర్దేశించింది. ప్రత్యేక సమగ్ర సవరణ-2023 ప్రక్రియ కొనసాగే కాలవ్యవధిలో ఎవరైనా పోలింగ్ బూత్ ఏజెంట్ 30 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పునః తనిఖీ చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా బుధవారం ప్రకటన విడుదల చేశారు. ముసాయిదా జాబితాను పరిశీలించి ఏవైనా సవరణలు అవసరమైతే వాటి కోసం దరఖాస్తు చేసుకునేలా ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లకు ఏజెంట్లు అవగాహన కల్పించాలని సూచించారు.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్‌రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!