Sriram Transport Finance: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

దిల్లీ: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, 12- 60 నెలల కాలావధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5 శాతం వరకు పెంచింది. ఈనెల 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా డిపాజిట్‌దార్లు 8.75 శాతం వరకు వార్షిక వడ్డీ పొందుతారని పేర్కొంది. వయోవృద్ధులకు అదనంగా మరో 0.50 శాతం వడ్డీ ప్రయోజనం ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌ పునరుద్ధరించుకుంటే, మరో 0.25 శాతం అదనపు వడ్డీ లభిస్తుందని తెలిపింది. 5-10 సంవత్సరాల నాటి వినియోగ ట్రక్‌ల కొనుగోలుకు రుణాలు ఇస్తామని ప్రకటించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని