డిజిటల్‌ కరెన్సీలో భారత్‌కు 7వ స్థానం

ఐక్యరాజ్యసమితి: భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని తెలిపింది. యూఎన్‌ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్‌సీటీఏడీ ప్రకారం, 2021లో అభివృద్ధి చెందిన 20 ఆర్థిక వ్యవస్థల్లో 15 దేశాల జనాభా క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్నారు. ఉక్రెయిన్‌ జాబితాలో 12.7 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. రష్యా (11.9 శాతం), వెనెజువెలా (10.3 శాతం), సింగపూర్‌ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), యూఎస్‌ (8.3 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో 7.3 శాతం మంది ప్రజలు డిజిటల్‌ కరెన్సీ కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా 20 ఆర్థిక వ్యవస్థల్లో డిజటల్‌ కరెన్సీ వాటా కలిగి ఉన్న జనాభాలో భారత దేశానికి ఏడో స్థానం లభించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.


మరిన్ని

ap-districts
ts-districts