ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు అటల్‌ పింఛన్‌ యోజనకు అనర్హులు

2022 అక్టోబరు 1 నుంచి అమలు

అంతక్రితం చేరినవారికి వర్తించదు

దిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు అక్టోబరు 1 నుంచి అటల్‌ పింఛన్‌ యోజన (ఏపీవై)కు అనర్హులని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘2022 అక్టోబరు 1 కంటే ముందు ఈ పథకంలో చేరిన వారికి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ ఎవరైనా ఆ తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేస్తాం. అప్పటివరకు వారు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చందాదార్లకు చెల్లిస్తామ’ని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 18-40 ఏళ్ల మధ్య వయసున్న భారతీయ పౌరులు బ్యాంక్‌/పోస్టాఫీస్‌ శాఖల ద్వారా ఏపీవై ఖాతాలను తెరిచేందుకు అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 99 లక్షలకు పైగా ఏపీవై ఖాతాలు తెరవడంతో 2022 మార్చి 31 నాటికి మొత్తం చందాదార్ల సంఖ్య 4.01 కోట్లకు చేరింది.


మరిన్ని

ap-districts
ts-districts