ఈ నెల 16 వరకూ ‘క్రోమా’ ఇండిపెండెన్స్‌ డే సేల్‌

ఈనాడు, హైదరాబాద్‌: టాటా గ్రూపు సంస్థ క్రోమా, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రకాలైన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు, డిస్కౌంట్లు ప్రకటించింది. ‘క్రోమా ఇండిపెండెన్స్‌ డే సేల్‌- 2022’ ఈ సదుపాయాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో అందిస్తున్నట్లు క్రోమా వెల్లడించింది. క్రోమా.కామ్‌ వెబ్‌సైట్లోనూ చేపట్టే కొనుగోళ్లకు ఈ రాయితీలు వర్తిస్తాయి. స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్లు, యాపిల్‌ ఐపాడ్‌లు, ఇంకా ఎన్నో రకాలైన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు, 20 శాతం వరకూ క్యాష్‌ బ్యాక్‌, 24 నెలల సులువైన వాయిదా పథకాలు అందిస్తున్నట్లు క్రోమా తెలియజేసింది. ఎంపిక చేసిన క్రెడిట్‌/ డెబిట్‌ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం వరకూ డిస్కౌంట్‌ వెనువెంటనే లభిస్తుంది.


మరిన్ని

ap-districts
ts-districts