స్పెన్సర్స్‌ రిటైల్‌ నష్టం రూ.34 కోట్లు

దిల్లీ: ఆర్‌పీ-సంజీవ్‌ గొయెంకా గ్రూప్‌ సంస్థ స్పెన్సర్‌ రిటైల్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.33.63 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం నమోదు చేసిన రూ.23.55 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి మరింత పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.552 కోట్ల నుంచి రూ.621 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.598.37 కోట్ల నుంచి రూ.673.03 కోట్లకు పెరిగాయి. 2022 జూన్‌ 30 నాటికి స్పెన్సర్స్‌ రిటైల్‌ 13.89 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 155 విక్రయశాలల్ని నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆస్తుల కంటే సంస్థ అప్పులు, రుణాలు రూ.403.73 కోట్లు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.


మరిన్ని

ap-districts
ts-districts