GST On Rentals: అద్దెపై 18% జీఎస్‌టీ.. కేంద్రం క్లారిటీ

GST On Rentals: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జూన్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేశారు. ఇవి జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. అద్దెకుంటున్నవారు అద్దెపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలన్నది అందులో ఒకటి. అయితే, ఈ విషయంలో ఎవరెవరికీ జీఎస్‌టీ వర్తించనుందనే దానిపై ఇటీవల మీడియాలో భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా కేంద్ర స్పష్టతనిచ్చింది. 

అద్దెకు ఉంటున్న ప్రతిఒక్కరూ జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అలాగే మీడియాలో వస్తున్నట్లు జీఎస్‌టీ నమోదిత వ్యక్తులందరూ కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకుండే వారెవరూ జీఎస్‌టీ చెల్లించనక్కర్లేదని తెలిపింది. దీంతో వ్యాపారులు, ఏదైనా సంస్థలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా కుటుంబ అవసరాల కోసం ఇళ్లు అద్దెకు తీసుకుంటే పన్ను కట్టాల్సిన పని లేదు. వేతన జీవులకు ఎలాగూ జీఎస్‌టీ పరిధిలో ఉండరు కాబట్టి వారు కూడా అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కేవలం వాణిజ్య అసవరాల కోసం ఏదైనా ప్రాపర్టీని అద్దెకు తీసుకున్నవారు.. అదీ జీఎస్‌టీలో రిజిస్టర్‌ అయినవాళ్లు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.



మరిన్ని

ap-districts
ts-districts