బ్రిటన్‌లో భారత విద్యార్థులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రత్యేక ఖాతాలు

లండన్‌: బ్రిటన్‌లో భారత విద్యార్థుల కోసం ప్రత్యేక ఖాతా సేవలను తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ యూకే తెలిపింది. ‘ది హోమ్‌వాంటేజ్‌ కరెంట్‌ అకౌంట్‌ ఖాతా’తో వీసా డెబిట్‌ కార్డును మంజూరు చేస్తారు. ఈ కార్డును ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించుకునే సౌలభ్యం ఉంది. బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులు భారత్‌ను విడిచిపెట్టడానికి ముందే డిజిటల్‌గా కార్డును యాక్టివేట్‌ చేసుకోవచ్చు. భారత్‌లో సేవింగ్స్‌ ఖాతాకు ఇది సమానమని, ఖాతాదారుడు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌లను యాక్టివేట్‌ చేసుకోవచ్చని బ్యాంక్‌ వెల్లడించింది. భౌతిక డెబిట్‌ కార్డును కూడా విద్యార్థులు ఎంచుకోవచ్చు. భారత్‌ లేదా బ్రిటన్‌ చిరునామాకు ఈ కార్డును డెలివరీ చేస్తారు. బ్రిటన్‌లో చదువుకునే భారత విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఖాతా సేవలను రూపొందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ యూకే పీఎల్‌సీ హెడ్‌ (రిటైల్‌ బ్యాంకిం్) ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు.


మరిన్ని