
బ్యాంకింగ్ యాప్‌లకు సోవా ముప్పు
అప్రమత్తంగా ఉండాలి
ఖాతాదారులను హెచ్చరిస్తున్న బ్యాంకులు
ఈనాడు, హైదరాబాద్: పండగల వేళ డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు అన్నీ డిజిటల్లోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ వైరస్ల లింకులను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ వచ్చింది. ‘సోవా’ పేరుతో ఒక వైరస్ మొబైల్ ఫోన్లలోకి జొరబడుతోందని, అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
అరచేతిలోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ క్షణాల్లో నిర్వహించుకునే వీలు యాప్‌ల ద్వారా వీలవుతుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకూ తమ ఖాతాదారుల ప్రయోజనం కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అవగాహనతో వీటిని వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, మోసగాళ్లు ఈ బ్యాంకింగ్ యాప్‌లను పోలినట్లుగానే మరో నకిలీ యాప్‌లను సృష్టిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు ‘సోవా’ మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపిస్తున్నారు. అందులో ఉన్న పొరపాటున క్లిక్ చేస్తే చాలు. ఈ ఆండ్రాయిడ్ ట్రోజన్ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ) సోవా వైరస్ విషయంలో బ్యాంకులకు సమాచారం ఇవ్వడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో పాటు పలు బ్యాంకులు ఈ విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ సంక్షిప్త సందేశాలను పంపిస్తున్నాయి.
ఏమిటిది?
‘సోవా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది ఫోన్లలో చేరి, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారంతోపాటు, నెట్- బ్యాంకింగ్ యాప్‌లను వాడినపుడు పాస్‌వర్డ్‌లను తస్కరిస్తుంది. ఒక్కసారి ఇది ఫోన్లో చేరితే..దీన్ని తొలగించడం దాదాపు అసాధ్యం’ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విటర్ ఖాతాలో తెలిపింది. ఈ వైరస్ ఎక్కువగా సంక్షిప్త సందేశాల రూపంలోనే వస్తోంది. ఒక్కసారి ఫోన్లో చేరాక.. అందులో ఉన్న యాప్‌ల గురించి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాంకింగ్ యాప్‌లను లక్ష్యంగా చేసుకొని, మాల్వేర్ను పంపించి, వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంటారు.
టోకన్లనూ పసిగట్టేలా..
క్రెడిట్ కార్డు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ఈ నెల 1 నుంచి టోకనైజేషన్ అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఈ సోవా వైరస్ ఈ ‘మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)’ వివరాలనూ తస్కరించేంత శక్తిమంతంగా ఉందని బ్యాంకింగ్ సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకంగా 200 రకాలకు పైగా బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతోపాటు, క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ ఇది లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొంటున్నారు. కేవలం బ్యాంకింగ్ యాప్‌లే కాదు.. ఇతర సమాచారాన్నీ ఇది ఎన్క్రిప్షన్ చేయడంతోపాటు, వాటిని తిరిగి పొందేందుకు కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
జాగ్రత్తలు ఇలా..
సోవా వైరస్ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంకులు కొన్ని సూచనలు చేస్తున్నాయి. అవేమిటంటే..
* అధీకృత యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని డౌన్లోడ్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన సమీక్షలు (రివ్యూలు) తదితరాలు చూసుకోండి.
* మీరు యాప్ ఉపయోగించుకునేందుకు అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని అందించండి. అనుమతుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
* అధీకృత యాప్‌లు ఇస్తున్న అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి.
* ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే వెబ్సైట్ లింకులను ఎట్టి పరిస్థిత్లుల్లోనూ క్లిక్ చేయొద్దు.
* పొట్టి యూఆర్ఎల్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఉపయోగించే ముందు వాటిని యూఆర్ఎల్ చెకర్లో వేసి చూడాలి. అక్కడ దాని పూర్తి వివరాలు కనిపిస్తాయి.
* బ్యాంకింగ్ యాప్‌లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
మరిన్ని
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం