
Kia Carens: 44 వేల కియా కరెన్స్ కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) తమ తాజా మోడల్ కరెన్స్ (Carens) కార్లను రీకాల్ (Recall) చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ నియంత్రణా సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నాయేమో తనిఖీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు 44 వేల కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏమైనా లోపాన్ని గుర్తిస్తే ఉచితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ సేవల్ని అందజేస్తామని చెప్పింది. దీనిపై తాము నేరుగా కరెన్స్ యజమానులనూ సంప్రదిస్తామని వెల్లడించింది. ఒకవేళ ఏ కారులోనైనా సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని తమ సిబ్బంది నిర్ణయిస్తే సదరు యజమానులు నిరంతరం కియా డీలర్షిప్ ప్రతినిధులతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది. తగు సమయాన్ని చూసుకొని కావాల్సిన మార్పులు చేస్తామని పేర్కొంది. 6, 7 సీట్ల సామర్థ్యంతో వస్తున్న కరెన్స్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో కియా విడుదల చేసింది.
మరిన్ని
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం