గోధుమల ధరలు పెరిగితే చర్యలు చేపడతాం

ఆహార కార్యదర్శి సంజీవ్‌ చోప్రా

దిల్లీ: గోధుమల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, రిటైల్‌ మార్కెట్‌లో అసాధారణంగా ధరలు పెరిగితే తగిన చర్యలు చేపడతామని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్‌ చోప్రా పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి కంటే అధికంగానే ఉన్నాయని అన్నారు.  ‘బియ్యం ధరలు స్తబ్దుగానే ఉన్నాయి. మేలో ఎగుమతులపై నిషేధం విధించిన తర్వాత గోధుమల ధరలు 7 శాతం మేర పెరిగాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ధరల పెరుగుదల 4-5 శాతంగా ఉంది’ అని సంజీవ్‌ అన్నారు. దేశీయ సరఫరాలు పెంచేందుకు, ధరల నియంత్రణకు ఈ ఏడాది మేలో ప్రభుత్వం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. 2022-23 మార్కెటింగ్‌ సంవత్సరంలో గోధుమల సేకరణ 434.44 లక్షల టన్నుల నుంచి 187.92 లక్షల టన్నులకు పరిమితమైంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం, ప్రైవేట్‌ పార్టీలు అధికంగా కొనుగోళ్లు చేపట్టడం ఇందుకు కారణం.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు