
సీఏల వైఫల్యం వల్లే సత్యం కుంభకోణం
హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ పరేఖ్
దిల్లీ: ఖాతా పుస్తకాల్లో అవకతవకలను ముందుగా ఎత్తిచూపడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) విఫలం కావడం వల్లే సత్యం కంప్యూటర్స్ కుంభకోణం చోటుచేసుకుందని హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. బుధవారమిక్కడ సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు చెందిన అందరు స్వతంత్ర డైరెక్టర్లు ఆ కంపెనీ వ్యవస్థాపకుడైన బి రామలింగరాజుకు రబ్బరు స్టాంపుల్లా వ్యవహరించార’ని పేర్కొన్నారు. ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడడం ద్వారా, పలు సంవత్సరాల పాటు లాభాలను పెంచి చూపినట్లు స్వయానా ఆ కంపెనీ వ్యవస్థాపకులు రామలింగరాజు 2009 జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో టెక్ మహీంద్రా ఆ కంపెనీని టేకోవర్ చేసింది. ఏ కంపెనీకి చెందిన సీఈఓ అయినా.. వాటాదార్ల ప్రయోజనం కోసం పనిచేయాలని పరేఖ్ సూచించారు. కొంత మంది వ్యక్తుల దురాశ కారణంగా చాలా వరకు కంపెనీలు కనుమరుగు కావాల్సి వస్తోందన్నారు. సత్యం కుంభకోణంలో ఆరుగురు సీఏల సభ్యత్వాన్ని, వారి సంఘం ఐసీఏఐ అప్పట్లో రద్దు చేసిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారాలు సత్యం కుంభకోణాన్ని ఒక సినిమాలా తీయొచ్చని ఇదే కార్యక్రమంలో ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సరదాగా అన్నారు.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!