
Mutual Fund SIP: ఎన్ని రకాలుగా ‘సిప్’ చేయవచ్చో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: మదుపర్లు మ్యూచువల్ ఫండ్లలో ఏకమొత్తంగా (లంప్సమ్) గానీ, క్రమానుగత (సిప్) విధానంలో గానీ మదుపు చేయవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో ఉంటే ఏకమొత్తంగా పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ, ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారికి మాత్రం క్రమానుగత పెట్టుబడుల (సిప్) విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు ప్రారంభించి దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకునేందుకు సాయపడుతుంది. అలాగే మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా అన్ని మార్కెట్ సైకిల్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల సగటు ధరతో నష్టభయాన్ని తగ్గించుకొని మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల సిప్‌లు అందుబాటులో ఉన్నాయి. సంపదను కూడబెట్టాలనుకునే వారు.. వారి వారి లక్ష్యాలు, లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న కాలపరిమితి, పెట్టుబడుల సామర్థ్యం తదితర అంశాలకు అనుగుణంగా సరైన సిప్ ఎంచుకోవడం ప్రధానం. అందువల్ల ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల సిప్ల గురించి తెలుసుకుందాం.
రెగ్యులర్ సిప్..
సిప్‌లో ప్రాథమిక రకం. సరళంగా ఉంటుంది. మదుపర్లు నిర్ణీత వ్యవధి (ఫ్రీక్వెన్సీ)లో ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని మదుపు చేస్తారు. నిధుల సౌలభ్యతను అనుసరించి మదుపర్లు సిప్ ఫ్రీక్వెన్సీని నెలవారీ, ద్వైమాసికం, త్రైమాసికం, అర్ధ వార్షికం, వార్షిక ప్రాతిపదికన ఎంచుకోవచ్చు. రోజువారీ, వారపు సిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఎంచుకునేది.. ఆర్థిక నిపుణులు సూచించేదీ నెలవారి సిప్‌నే. మీరు ఎంచుకునే ఫ్రీక్వెన్సీ, కాలపరిమితి, సిప్ మొత్తంలను సిప్ ఎంచుకున్నప్పుడే పేర్కొనాలి. సాధారణ సిప్‌లో పెట్టుబడుల వ్యవధిలో పెట్టుబడి మొత్తాన్ని మార్చలేరు.
టాప్-అప్ సిప్..
దీన్నే స్టెప్-అప్ సిప్ అని కూడా అంటారు. మదుపర్లు తమ క్రమానుగత పెట్టుబడులను పెంచుకునేందుకు స్టెప్-అప్ సిప్ అనుమతిస్తుంది. అంటే, మదుపర్లు తమ ఆదాయం పెరిగినప్పుడల్లా సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి, తక్కువ జీతం ఉన్నప్పుడు తక్కువ మొత్తంతో సిప్ ప్రారంభించినా జీతం పెరిగినప్పుడు పెట్టుబడులను పెంచుకునేందుకు సాయపడుతుంది. దీంతో అధిక మొత్తాలను ఆదా చేయడంతో పాటు లక్ష్యం చేరుకునేందకు కావాల్సిన మొత్తాన్ని త్వరగా సమకూర్చుకోవచ్చు.
ఉదాహరణకు మీరు రూ.1000 వార్షిక స్టెప్-అప్ సిప్‌ను ఎంచుకుని నెలకు రూ. 10,000తో పెట్టుబడులు ప్రారంభించారునుకుందాం. 12 నెలల పాటు ఇదే మొత్తం సిప్ చేసినా 13వ నెల నుంచి రూ.11,000 సిప్ చేయాలి. ఆ తర్వాత 25వ నెల నుంచి రూ.12,000.. ఇలా ప్రతి సంవత్సరం పెట్టుబడులు మొత్తం పెరుగుతూ వస్తుంది. ఇందులో ప్రతి ఏడాదీ నిర్ణీత శాతం పెరిగేలా కూడా ఎంచుకోవచ్చు.
ఫ్లెక్సిబుల్ సిప్..
పేరులో సూచించినట్లుగానే సౌకర్యవంతంగా పెట్టుబడులు చేసే వీలుకల్పిస్తుంది. దీన్ని ఫ్లెక్సీ సిప్ లేదా ఫ్లెక్స్ సిప్ అని కూడా అంటారు. ఇందులో పెట్టుబడిదారులు తమ ఆర్థిక స్థితిగతులకు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టబడి మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక నెల అనుకోని ఖర్చులు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో నగదు కొరత ఏర్పడి పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. అలాంటి సమయంలో ఒకటి, రెండు నెలల సిప్‌ను నిలిపి వేయమని ఫండ్ హౌస్‌ను కోరవచ్చు. దీనివల్ల డిఫాల్ట్ లేకుండా సిప్‌ను దాటివేయవచ్చు. అదేవిధంగా పెట్టబడిదారుని వద్ద మిగులు మొత్తం ఉంటే సిప్ పెంచుకోవచ్చు.
అలాగే, మార్కెట్లు పడిపోయినప్పుడు ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడులు పెట్టి ఎక్కువ యూనిట్లు పొందవచ్చు. మార్కెట్లు హెచ్చులో ఉన్నప్పుడు సిప్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఫండ్హౌస్కి ఇచ్చే సూచనలను బట్టి సిప్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. సిప్ మొత్తాన్ని మార్చుకోవాలనుకుంటే సిప్ తేదీకి వారం లేదా రెండు వారాలు ముందుగా ఫండ్‌హౌస్‌కు వివరాలు తెలియజేయాలి.
శాశ్వత సిప్..
మదుపర్లు తమ సిప్‌ను ఎప్పటివరకు కొనసాగించాలో తెలియజేయకపోతే, అది శాశ్వత సిప్ అవుతుంది. ఎంత కాలం పాటు సిప్‌ను కొనసాగించాలో తెలియనప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. సిప్‌ను నిలిపివేయమని ఫండ్‌హౌస్ లేదా ఫండ్ మేనేజర్‌కు తెలియజేసే వరకు సిప్ కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఎప్పుడైనా సిప్ మొత్తాన్ని రీడీమ్ చేసుకోవచ్చు.
ట్రిగ్గర్ సిప్..
ఇది మార్కెట్ కదలికలపై పట్టు ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ రకమైన సిప్‌లో కొనుగోలు, అమ్మకపు స్థానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మదుపర్లు వారి సిప్ ప్రారంభ తేదీని సెట్ చేసుకోవచ్చు. ఎంచుకున్న ఈవెంట్‌కు చేరుకున్న తర్వాత రీడీమ్, స్విచ్ చేయవచ్చు.
ఉదాహరణకు మీ లక్ష్యం కోసం కావాల్సిన మొత్తాన్ని ఎంచుకున్న సమయం కంటే ముందుగానే చేరుకున్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్ స్థితి బాగుందనుకుంటే ట్రిగ్గర్ సిప్‌లో సిప్ మొత్తాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. లేదా మరొక ఫండ్‌కు స్విచ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో ట్రిగ్గర్ సిప్ సదుపాయం.. మదుపర్లు ట్రిగ్గర్ పాయింట్‌కు చేరుకున్నప్పుడు.. సమకూరిన మొత్తంలో కొంత భాగాన్ని గానీ, పూర్తిగా గానీ రీడీమ్ చేసుకోవడంలో సాయపడుతుంది.
బీమాతో సిప్..
మదుపరి దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకుంటే కొన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు బీమా రక్షణను అందిస్తాయి. బీమా ప్రారంభ కవరేజీ సాధారణంగా మొదటి సిప్ మొత్తానికి పది రెట్లు ఉంటుంది. కాలక్రమేణా పెరుగుతుంది. అయితే ఈ ఫీచర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. టర్మ్ బీమా యాడ్-ఆన్ ఫీచర్ మాత్రమేనని, ఫండ్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపదని మదుపర్లు గమనించాలి.
మల్టీ సిప్..
ఒకే సిప్ ద్వారా ఫండ్ హౌస్ అందించే వేరు వేరు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మల్టీ సిప్ అనుమతిస్తుంది. మదుపర్లు వారి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడంలో ఇది సాయపడుతుంది.
చివరిగా..
మ్యూచువల్ ఫండ్లలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడానికి సిప్ ఒక మంచి మార్గం. వ్యక్తులు వారి వారి లక్ష్యాలు, అవసరాలు, పెట్టుబడుల సామర్థ్యం, కాలపరిమితి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సిప్‌ను ప్రారంభించడం మంచిది.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!