వరదకు పంటలు దెబ్బతిని రైతు ఆత్మహత్య

కుభీరు, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా కుభీరు మండలంలోని హల్దా గ్రామానికి చెందిన మారేరావు గంగాధర్‌ (50) పురుగుమందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్‌కు అయిదు ఎకరాల పొలం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి, సోయా పంటలు కొట్టుకుపోయాయి. పంటసాగు కోసం, గత ఏడాది కుమార్తె పెళ్లి కోసం అప్పులు చేశారు. వేసిన పంట దెబ్బతినడంతో చేసిన రూ.మూడు లక్షల అప్పు ఎలా తీర్చాలని బాధపడుతూ ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లారు. అక్కడే పురుగులమందు తాగారు. కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts