కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న వాలంటీరు అరెస్టు

విడపనకల్లు, న్యూస్‌టుడే: గ్రామ వాలంటీరు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని చీకలగురికి గ్రామానికి చెందిన వాలంటీరు గోపాల్‌ శుక్రవారం బళ్లారి నుంచి ద్విచక్ర వాహనంలో కర్ణాటక మద్యం తీసుకొస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు పాల్తూరు శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యంతో పట్టుబడ్డాడు. 55 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రామచంద్రయ్య తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts